: సద్దాంపై తన వ్యాఖ్యలను సమర్థించుకున్న డొనాల్డ్ ట్రంప్


ఇరాక్ నియంత సద్ధాం హుస్సేన్ మంచోడు అనడంపై అమెరికాలో తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. సోషల్ మీడియాల్ 'ట్రంప్ లవ్స్ సద్దాం' అంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. దీంతో తేరుకున్న డొనాల్డ్ ట్రంప్ తాను సద్దాం హుస్సేన్ ను తీవ్రవాదులను హతమార్చినందుకు మాత్రమే మంచోడన్నాను తప్ప సద్దాంను ప్రేమిస్తున్నానని చెప్పలేదని ఓహియోలో జరిగిన ప్రచారసభలో వివరణ ఇచ్చారు. సద్దాం హుస్సేన్ అంటే తనకు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆయన వ్యతిరేక హిల్లరీ వర్గం మాత్రం ఆయనపై విమర్శల పరంపర సంధిస్తూనే ఉంది. సద్దాం, గడాఫీలను మంచోళ్లనే ట్రంప్ చేతికి అమెరికా పగ్గాలు ఇస్తే...ఇక్కడ కూడా అలాంటి పాలనే వస్తుందని మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News