: ‘యుక్తా’ వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్


యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు సంఘం (యుక్తా) ఆరో వార్షికోత్సవాలకు ముఖ్యఅతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ నెల 9న లండన్ లో జరగనున్న ఈ వేడుకలకు పవన్ వెళ్లనున్నట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటన చేసింది. ఈస్ట్ లండన్ లోని ట్రాక్సీ థియేటర్లో అక్కడి తెలుగు వారు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. సుమారు రెండు వేలకు పైగా తెలుగు కుటుంబాలు పాల్గొననున్న ఈ వేడుకలలో పవన్ పలువురు కళాకారులను సత్కరించనున్నారని, అనంతరం అక్కడి తెలుగు వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆ ప్రకటనలో తెలిపారు.

  • Loading...

More Telugu News