: శంషాబాద్ పోలీసుల‌తో వాగ్వివాదానికి దిగిన కాంగో దేశస్థురాలు సింథియా బంధువులు


నాలుగు రోజుల క్రితం త‌న భార్య సింథియాను రూపేశ్ అనే వ్యక్తి దారుణంగా హ‌త్య‌చేసిన సంగ‌తి తెలిసిందే. కాంగో దేశస్థురాలయిన సింథియా హ‌త్య ప‌ట్ల ఆమె బంధువులు ఆందోళ‌న తెలుపుతున్నారు. హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్ పోలీస్ స్టేష‌న్ ముందు సింథియా బంధువులు ఈరోజు ఆందోళ‌న‌కు దిగారు. సింథియాను దారుణంగా హ‌త్యచేసిన‌ రూపేశ్ ను క‌ఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సింథియా కుమార్తె సానియాను త‌మ‌కు అప్ప‌గించాలని ఆందోళ‌న చేస్తున్నారు. అయితే, సానియా మాత్రం త‌న‌ నాయ‌న‌మ్మ వ‌ద్దే తాను ఉంటాన‌ని చెబుతున్న‌ట్లు స‌మాచారం. సింథియా బంధువులు నిన్న కూడా పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News