: విడాకులు కుదరదు... ఓ చీర తెచ్చి భార్యకివ్వు చాలన్న ఇండోర్ న్యాయమూర్తి!


నిత్యమూ ఇంటిపనులు, వంట పనులు, పిల్లల ఆలనా, పాలనా వంటి గంపెడు చాకిరీతో అలసిపోయే భార్య కోరుకునేది ఒక్కటే. భర్త నుంచి కాసింత ప్రేమ, ఆదరణ. ఇక అదే దక్కపోతే... ఇక్కడా అదే జరిగింది. ఏ మాత్రమూ పెద్ద కారణాలు, విభేదాలు లేకుండా విడాకుల కోసం కోర్టుకు ఎక్కిన ఓ జంటను వినూత్న రీతిలో కలిపే ప్రయత్నం చేశారు న్యాయమూర్తి. ఈ ఘటన ఇండోర్ సమీపంలోని ఖార్గోనే చీఫ్ జ్యుడీయల్ మెజిస్ట్రేట్ కోర్టులో జరిగింది. న్యాయమూర్తి గంగాచరణ్ దూబే, విడాకులు మంజూరు చేసేంత పెద్ద కారణాలు కనిపించడం లేదని భావించి, భర్త సంజూకు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఓ మంచి చీరను కొని తీసుకురావాలని చెప్పిన ఆయన, కోర్టులో భర్త పలకాల్సిన మాటలను రిహార్సల్ చేయించారు. ఆపై అందరి ముందూ భార్య రానూతో "నువ్వు చాలా అందంగా ఉంటావు. ఈ చీరను ఎప్పుడు ధరిస్తావు? ఇది కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటావు" అని చెప్పించారు. తాను ఒంటరిగా ఉంటున్నానని, తనను భర్త విస్మరిస్తున్నాడని రానూ కోర్టుకు ఎక్కగా, ఆమెను షాపింగ్ కు తీసుకు వెళ్లాలని సంజూను ఆదేశించారు. దీంతో ఆ జంట తిరిగి వైవాహిక జీవితంలోకి వెళ్లింది.

  • Loading...

More Telugu News