: దేశ వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు
దేశవ్యాప్తంగా నేడు పవిత్ర రంజాన్ పండుగని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. రంజాన్ సందర్భంగా దేశంలోని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ప్రసిద్ధ జామా మసీదులో వేలాది మంది ముస్లిం సోదరులు ఈరోజు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముంబయి, కోల్‌కతా, చెన్నైలో సందడి నెలకొంది. లక్నో, అలహాబాద్‌లోనూ ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ముస్లిం సోదరులు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ సందడిగా గడుపుతున్నారు. చార్మినార్ మక్కామసీదు వద్ద ముస్లిం సోదరుల ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ఆ మసీదు వద్దకు వందలాదిగా ముస్లిం సోదరులు తరలివచ్చారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈద్గాల్లో పలువురు మంత్రులు ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. పలు చోట్ల ప్రార్థనల అనంతరం ఈద్గా ఆవరణల్లో ముస్లిం సోదరులు మొక్కలు నాటారు.