: అనుప్రియను బీజేపీ లాగేసుకుంది: 'అప్మాదళ్' చీఫ్ కృష్ణా పటేల్


ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ ను ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని ఆ పార్టీ అధినేత్రి, అనుప్రియ తల్లి కృష్ణా పటేల్ తీవ్రంగా తప్పుబట్టారు. అప్నాదళ్ పార్టీని మోసం చేస్తూ, బీజేపీ ఆమెను లాగేసుకుందని అన్నారు. "లోక్ సభ ఎన్నికల్లో కుర్మి వర్గం ఓట్ల కోసం మమ్మల్ని వాడుకున్న బీజేపీ, ఇప్పుడు మా కుటుంబాన్ని ముక్కలు చేసింది" అని ఆమె ఆరోపించారు. పార్టీ నాయకత్వ బాధ్యతల విషయంలో తల్లీబిడ్డల మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ చేసింది తప్పని, తన కుమార్తెను దూరం చేశారని ఆరోపించిన ఆమె, తనకు సమాచారం ఇవ్వకుండానే అనుప్రియకు పదవి ఇచ్చారని, ఇది ఎన్డీయే కూటమి నైతికతపై ప్రశ్నలు సంధిస్తోందని అన్నారు. ఇకపై అప్నాదళ్ పార్టీ ఓంటరిగానే పోరు సాగిస్తుందని తెలిపారు. తన భర్త, పార్టీ వ్యవస్థాపకులు సోనేలాల్ పటేల్ లక్ష్య సాధనకు కృషి చేస్తానని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News