: సమస్యలు అర్థం చేసుకుని ఉద్యోగులు వస్తున్నారు.. సంతోషం: గవర్నర్ నరసింహన్
గవర్నర్ నరసింహన్ ప్రస్తుతం అమరావతిలో సచివాలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు అక్కడి పనులను గురించి వివరిస్తున్నారు. ఈ సందర్భంగా నరసింహన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘సమస్యలు అర్థం చేసుకుని ఉద్యోగులు వస్తున్నారు.. సంతోషం’ అని అన్నారు. నూతన రాజధాని కాబట్టి కొన్ని సమస్యలు ఉంటాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మించడానికి చంద్రబాబు చేస్తోన్న కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అన్ని సమస్యలను అధిగమిస్తూ ముందుకువెళుతోందని నరసింహన్ అన్నారు. ఉద్యోగులు రాజధానిలో విధులు నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలను సమర్థంగా కల్పిస్తోందని ఆయన అన్నారు. పుష్కరపనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు.