: స్మృతీ ఇరానీపై షాకింగ్ కామెంట్స్ చేసిన అలీ అన్వర్!
రాజ్యసభ సభ్యుడు, జనతాదళ్ (యు) నేత అలీ అన్వర్, మానవ వనరుల శాఖ నుంచి కొత్తగా చేనేత జౌళి శాఖకు మారిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎవరూ అంగీకరించేలా లేని ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది. ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆయన "చేనేత శాఖకు ఆమె మంత్రిగా ఎంపిక కావడం మంచిదే. తన శరీరాన్ని పూర్తిగా కప్పుకునేందుకు పదవి సహకరిస్తుంది" అని సంచలన వ్యాఖ్య చేశారు. ఆపై విమర్శలు వెల్లువెత్తగా, తాను సాధారణ ప్రజల దుస్తుల అవసరాలను ఉద్దేశించి మాత్రమే వ్యాఖ్యానించినట్టు ఆయన వివరణ ఇచ్చారు. అంతగా ప్రాధాన్యత లేని జౌళి శాఖకు మార్చడం పట్ల స్మృతీ కొంత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.