: హిల్లరీ క్లింటన్ ఎలాంటి తప్పూ చేయలేదు... ఈ-మెయిల్ కేసు మూసివేశామన్న యూఎస్


అమెరికాకు మంత్రిగా వ్యవహరించిన సమయంలో ప్రైవేటు ఈ-మెయిల్ సర్వర్ ద్వారా అధికారిక సమాచారాన్ని బట్వాడా చేశారని హిల్లరీ క్లింటన్ పై ఉన్న ఆరోపణల కేసును మూసి వేసినట్టు యూఎస్ అటార్నీ జనరల్ లోరెట్టా లించ్ వెల్లడించారు. ఈ మేరకు కేసును మూసివేయాలని ఎఫ్బీఐ నుంచి సిఫార్సులు రాగా, వాటిని పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వెల్లడించారు. కాగా, డెమొక్రాట్ల తరఫున హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్టు ఖరారు కాగానే, కేసు విచారణ మరోసారి తెరపైకి రాగా, భవిష్యత్తులో ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికైనా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా కేసుపై సత్వర నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావించిన సంగతి తెలిసిందే. మలి దశ విచారణ దాదాపు ఏడాది పాటు సాగగా, విచారణ అధికారులు ఏకగ్రీవంగా క్లీన్ చిట్ ఇచ్చారని లించ్ ఓ ప్రకటనలో తెలిపారు.

  • Loading...

More Telugu News