: చక్రం తిప్పిన రాజ్ నాథ్ సింగ్!... కేంద్ర ఉద్యోగుల సమ్మె వాయిదా!


ఐఏఎస్ అధికారులు, ఇతర ఉద్యోగుల మధ్య వేతనాల్లో భారీ వ్యత్యాసాలకు కేంద్రంగా నిలిచిన ఏడో వేతన సవరణ సిఫారసులపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 11న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే ఉద్యోగులతో సమ్మె విరమణకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. నిన్న ఢిల్లీలో ఆయా ఉద్యోగ సంఘాల నేతలలో సుదీర్ఘ చర్చలు నిర్వహించారు. ప్రభుత్వ వైఖరిని ఆయన ఉద్యోగుల ముందు పెట్టారు. ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లపై విస్తృత ఏకాభిప్రాయం కుదరాలన్న అంశంపై ఆయన ఉద్యోగ సంఘాల నేతలను ఒప్పించారు. వెరసి ఉద్యోగుల సమ్మెను ఆయన వాయిదా వేయించగలిగారు. రాజ్ నాథ్ చాతుర్యంతో ఇప్పటికిప్పుడు సమ్మె నిర్వహించాలన్న యోచనను ఉద్యోగ సంఘాల నేతలు వాయిదా వేసుకోక తప్పలేదు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు... సమ్మెను నాలుగు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News