: నిరుపేద జర్నలిస్టు కుటుంబానికి హీరో మంచు విష్ణు ఆర్థిక సాయం


ఏడాది కాలంగా పక్షవాతంతో మంచం పట్టిన జర్నలిస్టు దుర్గా గౌడ్ కుటుంబానికి హీరో మంచు విష్ణు తన వంతు సాయం చేశాడు. దుర్గా గౌడ్ పిల్లలకు నర్సరీ నుంచి ఇంటర్ మీడియట్ వరకు రూ. 22 లక్షలు విలువ చేసే కార్పొరేట్ విద్యనందిస్తానని, వారి బాధ్యతలు చూసుకుంటానని విష్ణు హామీ ఇచ్చాడు. కాగా, విష్ణు సోదరి మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమం ద్వారా దుర్గా గౌడ్ బాధలు తెరపైకి వచ్చాయి. 'మేము సైతం’ కార్యక్రమానికి పలువురు సినీ నటులు తమ వంతు సాయం చేశారు. ఇందులో భాగంగా మంచు విష్ణు ఇటీవల కూకట్ పల్లిలో పానీపూరి అమ్మి రూ.75,000 సంపాదించాడు. ఈ మొత్తాన్ని దుర్గాగౌడ్ అనారోగ్యం ఖర్చుల కోసం ఇచ్చాడు. మంచు లక్ష్మి కూడా తన వంతుగా ఒక లక్ష రూపాయలు ఇచ్చింది. మొత్తం 1 లక్షా 75 వేల రూపాయల చెక్కును దుర్గాగౌడ్ కు విష్ణు, లక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు తమ కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News