: నెలాఖరులోపు స్మార్ట్ పల్స్ సర్వే పూర్తి చేయాలి: చంద్రబాబు
నెలాఖరులోగా స్మార్ట్ పల్స్ సర్వేను పూర్తి చేయాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లతో పాటు సర్వేపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 8న ప్రారంభించే ఈ సర్వేను నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్మార్ట్ పల్స్ సర్వేను త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని సాంకేతిక అవకాశాలను వినియోగించుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ సర్వే ద్వారా సేకరించిన సమాచారం అన్ని శాఖలకు ఉపయోగపడుతుందని సూచించిన ఆయన, అన్ని శాఖలు ఇందులో పాలుపంచుకోవాలని అన్నారు.