: ఆ ముగ్గురు హీరోలంటే ఇష్టం!: హీరోయిన్ నివేద థామస్


దక్షిణాది హీరోయిన్ నివేద థామస్ మూడు భాషల్లో తనకు నచ్చిన ముగ్గురు హీరోల గురించి చెప్పింది. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తమిళంలో కమల హాసన్, మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో నాని అని చెప్పింది. కమల్ సినిమాల్లో నటించడం ద్వారా ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పింది. తెలుగులో తన మొదటి చిత్రమైన జెంటిల్ మన్ సక్సెస్ సాధించడం, ఈ చిత్రంలో తన పాత్రకు ఊహించని రెస్పాన్స్ రావడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పింది. కేరళలో పుట్టానని, చెన్నైలో పెరిగానని, హైదరాబాద్ చాలా బాగుందని చెప్పింది.

  • Loading...

More Telugu News