: కరీంనగర్ జిల్లాలో కొట్టుకున్న వైఎస్సార్సీపీ నేతలు
కరీంనగర్ జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు కొట్టుకున్న ఘటన కలకలం రేపుతోంది. వైఎస్సార్సీపీ జిల్లా నేతలు జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంబంధిత సమాచారం మార్పిడి విషయంలో మైనారిటీ నేతలు ఇద్దరు వాగ్వాదానికి దిగారు. అది చిలికిచిలికి గాలివానగా మారడంతో వారు కయ్యానికి దిగారు. ఒకరి గొంతు మరొకరు పట్టుకుని పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో సమావేశానికి హాజరైన ఇతర నేతలు అవాక్కయ్యారు. వారిద్దరినీ అతి కష్టం మీద విడదీసి, సమావేశం ముగించారు.