: తెలుగు రాష్ట్రాల సీఎంలు చర్చలు జరిపి, న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలి: బండారు దత్తాత్రేయ
హైకోర్టు విభజన, న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో తాను మరోసారి చర్చించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయవాదుల సమ్మెదినాలను సెలవులుగా ప్రకటించాలని కోరినట్లు పేర్కొన్నారు. హైకోర్టు విభజన అంశంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ కూర్చొని మాట్లాడుకోవాలని, న్యాయవాదుల సమస్యను వీలయినంత తొందరగా పరిష్కరించే దిశగా చర్చించాలని ఆయన సూచించారు. ఈ విషయంపై ఈ నెల 8 న తాను కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలవనున్నట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు.