: మళ్లీ అలిగిన టీడీపీ ఎంపీ మాగంటి బాబు!


పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఎంపీ మాగంటి బాబు మళ్లీ అలిగారు. ఈ ఏడాది ఏప్రిల్ లో సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన సందర్భంగా అక్కడ ఎంపీపీలు, జెడ్పీటీసీలను వేదికపైకి రానీయకపోవడంతో మాగంటి బాబు అలగడం, తన చేతిలోని మైక్ ను కిందపడేసి వెళ్లిపోవడం తెలిసిందే. తాజాగా, ఈసారి కూడా ఆయన అలకబూనారు. సీఎం చంద్రబాబు ఈరోజు జిల్లాలో పర్యటన సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. సీఎం కాన్వాయ్ ను దాటి వెళుతున్న మాగంటి వాహనాన్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు డ్రైవర్ ని పక్కన బెట్టి ఆయనే స్వయంగా నడుపుకుంటూ వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News