: మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. మ‌హిళపై 'హ‌త్యా'చారం


మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కడ చారగొండ గ్రామ శివారులో దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ మ‌హిళ‌పై అత్యాచారం చేసి, ఆపై పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టారు. అనంత‌రం అక్క‌డి నుంచి పారిపోయారు. కాలిపోయి ఉన్న మ‌హిళ మృత‌దేహాన్ని గ‌మ‌నించిన స్థానికులు ఈ విష‌యాన్ని పోలీసుల‌కి తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని అఘాయిత్యం ప‌ట్ల కేసు న‌మోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు మొద‌లు పెట్టారు. ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని విష‌యాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News