: ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీకి జైలు శిక్ష విధించిన స్పానిష్ కోర్టు
స్పెయిన్ దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు లియొనెల్ మెస్సీకి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. తాజాగా జరిగిన యూరోకప్ లో పెనాల్టీ షూటౌట్ లో గోల్ కొట్టడంలో విఫలమైన మెస్సీ...ఆ తప్పిదానికి ప్రతిగా అంతర్జాతీయ ఫుట్ బాల్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అంత కఠిన నిర్ణయం తీసుకోవద్దని, ఫుట్ బాల్ ఆడడంలో అత్యుత్తమ నైపుణ్యం కలిగిన మెస్సీ అప్పుడే రిటైర్ కాకూడదంటూ దిగ్గజాలు హితవు పలకగా, అభిమానులు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతలోనే పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న మెస్సీపై కేసులు నిర్ధారణ అయ్యాయి. మూడు కేసుల్లో మెస్సీ, అతని తండ్రిని దోషిగా నిర్ధారించిన స్పానిష్ కోర్టు 20 లక్షల యూరోలు జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేసినందుకు గాను 21 నెలల జైలు శిక్ష కూడా విధిస్తున్నట్టు పేర్కొంది.