: అందుకే, స్మృతీ ఇరానీ శాఖ మార్చారు: కన్నయ్య


కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ శాఖ మార్పిడికి కారణం సెంట్రల్ యూనివర్శిటీ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనేనని ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్ వ్యాఖ్యానించాడు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రి స్మృతీ ఇరానీ శాఖ మార్చడాన్ని స్వాగతిస్తున్నానని, అయితే శాఖ మార్చినంత మాత్రాన శిక్ష విధించినట్టు కాదని అన్నాడు. కాగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనలు చేపట్టడం, రాజకీయ నేతలు మద్దతు ప్రకటించడం తెలిసిందే.

  • Loading...

More Telugu News