: నేనెవరో తెలియని వాళ్ల దగ్గర కూడా స్టార్ లా ప్రవర్తిస్తా: ప్రియాంక చోప్రా
‘నేను ఎవరో తెలియని వాళ్ల దగ్గర కూడా స్టార్ లాగే ప్రవర్తిస్తాను. నేను ఎవరో అవతలివారికి తెలియకపోవచ్చు. కానీ, మిగతా ప్రపంచానికి తెలుసు. నేనేంటో నాకు తెలుసు’ అని ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా చెప్పింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన కెరీర్ ప్రారంభంలో ఐతీ రాజ్, ఫ్యాషన్ చిత్రాల్లో నటించానని, ఆ తర్వాత తనకు హీరోయిన్ గా అవకాశాలు రావని, తన పని ఇక అయిపోయిందని చాలా మంది విమర్శించారన్నారు. కానీ, అందుకు భిన్నంగా జరిగిందని, గొప్ప దర్శకులతో కలిసి పనిచేశానని, ప్రేక్షకులు తనను ఆదరించారని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తానెక్కడికైనా వెళ్లగలనని, ఏ భాష అయినా నేర్చుకోగలనని హాలీవుడ్ సినిమా ‘బేవాచ్’లో, అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’ నటించిన విశ్వనటి ప్రియాంకచోప్రా చెప్పింది.