: ఐఎస్ఐఎస్, భజరంగ్ దళ్ టార్గెట్‌లో నేనూ ఉన్నా: అసదుద్దీన్ ఓవైసీ
ఉగ్రవాదులకు న్యాయసహాయం చేస్తానని తాను చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు చేస్తోన్న విమర్శల పట్ల మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఈరోజు ఓ తెలుగు టీవీ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉగ్రవాది కసబ్‌కు న్యాయసహాయం అందించినప్పుడు ఇప్పుడు హైదరాబాద్ యువకులకు న్యాయసహాయం అందిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ‘ఐఎస్ఐఎస్, భజరంగ్ దళ్ టార్గెట్‌లో నేనూ ఉన్నా’ అని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. ‘దేశ వ్యాప్తంగా రాజకీయంగా ఎదిగేందుకే నేను న్యాయసహాయం చేస్తున్నానంటూ వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు’ అని ఆయన అన్నారు. ‘ఎన్ఐఏ అరెస్టు చేసిన ఉగ్రవాదులకు న్యాయసహాయం అందిస్తానని చేసిన నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా’ అని ఆయన పేర్కొన్నారు.