: అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం!... పట్టిసీమ ఆనందాన్ని జీవితంలో మరిచిపోలేనన్న చంద్రబాబు!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిని కృష్ణానదిలోకి వదిలారు. అక్కడ ఏర్పాటు చేసిన మోటార్లను స్విచాన్ చేసి, నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. దేశంలోనే నదుల అనుసంధానం చేసిన ఘనత తమ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని ఆయన ప్రకటించారు. అసాధ్యమనుకున్న పట్టిసీమ ప్రాజెక్టును సుసాధ్యం చేసి చూపామని ఆయన పేర్కొన్నారు. పట్టిసీమను ప్రారంభించిన సందర్భంగా కలిగిన సంతోషాన్ని తాను జీవితంలో మరిచిపోలేదనని కూడా ఆయన వ్యాఖ్యానించారు.