: రాహుల్ గాంధీకి పెళ్లి కుదిరిందోచ్!... అలహాబాదు బ్రాహ్మణ యువతిని ఖరారు చేసిన సోనియా?


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, ఆ పార్టీ యువరాజుగా పరిగణిస్తున్న రాహుల్ గాంధీకి అప్పుడే 46 ఏళ్లు వచ్చేశాయి. అయినా ఆయన బ్రహ్మచారిగానే ఉన్నారు. గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయనను టార్గెట్ చేసిన బీజేపీ నేతలు... రాహుల్ కు పెళ్లి కాని విషయాన్ని కూడా ప్రస్తావించారు. అయితే వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో ఆయనపై ఇదే తరహా ఆరోపణలు చేసే అవకాశం బీజేపీ నేతలకు చిక్కదేమో. ఎందుకంటే రాహుల్ గాంధీకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న ఆయన తల్లి, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈ మేరకు వధువును కూడా ఎంపిక చేశారట. ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని అలహాబాదు వెళ్లిన సోనియా గాందీ ఆ నగరానికి చెందిన ఓ బ్రాహ్మణ యువతిని వధువుగా ఎంపిక చేశారని కథనాలు వినిపిస్తున్నాయి. రాహుల్ పెళ్లిపై ఇప్పటికే పలు కథనాలు రాగా... వీటన్నిటినీ ఆయన ముందు పెట్టిన సోనియా గాంధీ ఎట్టకేలకు పెళ్లికి ఆయనను ఒప్పించేశారట. కొడుకు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వధువు కోసం సోనియా చాలా మందిని సంప్రదించారు. ఈ క్రమంలో రాజీవ్ గాంధీ బతికుండగా ఆయనకు కార్యదర్శిగా వ్యవహరించిన ఓ నేత అలహాబాదుకు చెందిన ఓ బ్రాహ్మణ యువతి సంబంధాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన మెచ్చిన సోనియా ఇటీవలే అలహాబాదుకు వెళ్లి వచ్చారు. రాజకీయ పర్యటనకే అలహాబాదు వెళుతున్నట్లు సోనియా వ్యక్తిగత సిబ్బంది చెప్పినా... రాహుల్ గాంధీకి పెళ్లి సంబంధం కుదిర్చే పని నిమిత్తమే ఆమె ఆ పర్యటనకు వెళ్లారట. అలహాబాదు అమ్మాయిని చూసి ఓకే చెప్పిన సోనియా గాంధీ గుట్టుచప్పుడు కాకుండా తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని కుమారుడికి కూడా చెప్పేసిన సోనియా... యూపీ ఎన్నికల్లోగానే ఈ పెళ్లి తంతును ముగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లితోనైనా ఎన్నిక్లలో కాస్తంత సానుకూల ఫలితాలు రాకపోతాయా? అన్న కోణంలో కూడా సోనియా గాంధీ ఆలోచిస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.

  • Loading...

More Telugu News