: వైఎస్ జగన్ వద్దకు ‘అగ్రిగోల్డ్’ పంచాయతీ!...బాధితుల ఆందోళనకు వైసీపీ అధినేత మద్దతు!


తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రజలను నిలువునా ముంచిన అగ్రిగోల్డ్ వ్యవహారం ఏపీలో విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలుపు కూడా తట్టింది. ప్రస్తుతం తన సొంత జిల్లా కడప జిల్లా పర్యటనకు వెళ్లిన జగన్ తన సొంతూరు పులివెందులలో ఉన్నారు. కొద్దిసేపటి క్రితం జగన్ వద్దకు అగ్రిగోల్డ్ భాధితులు తరలివెళ్లారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం తమను ఎలా ముంచేసిందో వారు ఆయనకు వివరించారు. నవ్యాంధ్ర నూతన రాజధాని పరిధిలోని అగ్రిగోల్డ్ సంస్థకు ఉన్న ఆస్తులను తక్షణమే విక్రయించి తమ డిపాజిట్లు విడుదలయ్యేలా చర్చలు చేపట్టాలని వారు ఆయనను వేడుకున్నారు. బాధితుల వాదనను సాంతం విన్న జగన్... అగ్రిగోల్డ్ బాధితులు చేపట్టే పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటించారు.

  • Loading...

More Telugu News