: మికా సింగ్ పై లైంగిక వేధింపుల కేసు!... రూ.5 కోట్లివ్వనందుకే కేసంటున్న బాలీవుడ్ సింగర్!


బాలీవుడ్ ప్రముఖ సింగర్ మికా సింగ్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ మోడల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబైలోని వెర్సోవా పోలీస్ట్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. ఈ కేసుపై వేగంగా స్పందించిన మికా సింగ్ కూడా సదరు మోడల్ పై ఎదురు కేసు పెట్టారు. వివరాల్లోకెళితే... మికా సింగ్ తో ఐదేళ్లుగా పరిచయం ఉన్న ఓ మోడల్... మికా సింగ్ తనపై లైంగిక వేధింపులకు దిగాడని ఆరోపించింది. బాలీవుడ్ లో అవకాశాలిప్పిస్తానని తిప్పుకున్న మికా సింగ్ చివరకు తనకు మొండి చేయి చూపారని ఆమె ఆరోపించింది. చివరకు ఈ విషయంపై మికా సింగ్ ను నిలదీయగా ఆయన తనపై వేధింపులకు పాల్పడ్డారని వాపోయింది. బాధితురాలి నుంచి అందిన ఫిర్యాదు మేరకు వెర్సోవా పోలీసులు ఐపీసీ 354, 323, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న మికా సింగ్ కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ మోడల్ పై ఫిర్యాదు చేశారు. రూ.5 కోట్లివ్వాలని ఆ మోడల్ తనను డిమాండ్ చేసిందని, ఇవ్వకపోతే తన కెరీర్ ని నాశనం చేస్తానంటూ బ్లాక్ మెయిల్ కూడా చేసిందని, అందుకు తిరస్కరించినందుకే తనపై కేసు పెట్టిందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదుల్లో ఏది వాస్తవమైనదో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా ఎవరిని అరెస్ట్ చేయలేదు.

  • Loading...

More Telugu News