: యూపీలో కాంగ్రెస్ ‘ఫేస్’ ఏదైనా ఫలితం ఒక్కటే!...ప్రియాంకా గాంధీ ప్రచారం వార్తలపై బీజేపీ కామెంట్!


దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేయగలిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఇప్పటికే ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తిరిగి పునర్వైభవం సాధించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో ప్రజల్లో మరో ఇందిరా గాంధీగా పేరున్న ప్రియాంకా గాంధీకి ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారన్న ప్రచారంపై బీజేపీ ఆసక్తికర కామెంట్లు చేసింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో బీజేపీ దినేశ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ... యూపీలో కాంగ్రెస్ ఏ ‘ముఖం’ పెట్టుకుని వచ్చినా ఫలితాల్లో మాత్రం పెద్దగా తేడా ఉండదని వ్యాఖ్యానించారు. ‘‘ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ పార్టీ ట్రంప్ కార్డుగా వాడుతోంది. గతంలో సోనియా గాంధీ విఫలమయ్యారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ వచ్చారు. తాజాగా ప్రియాంకా గాంధీ వస్తున్నారట. అంటే రాహుల్ గాంధీ ఫెయిల్ అయినట్లు వారే ఒప్పుకున్నట్లుంది. ఆశతోనే కాంగ్రెస్ జీవిస్తోంది. అయితే యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మరోమారు భంగపాటు తప్పదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News