: ఘట్‌కేసర్‌లో విషాదం.. తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఔషాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. 14 ఏళ్ల ఓ బాలుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడి ఓ ప్రైవేటు స్కూల్ హాస్టల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని జగద్గిరిగుట్టకు చెందిన నందన కుమార్‌గా గుర్తించారు. బాలుడు ఔషాపూర్‌లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. స్కూల్ హాస్టల్‌లో ఈ ఘటన చోటు చేసుకోవడం స్థానికంగా ఆందోళన రేపింది. బాలుడి ఆత్మహత్యకు గల కారణాల గురించి తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.