: దేశమంతా ఓ దారి!... కేరళ, కాశ్మీర్ లది మాత్రం మరో దారి!
నిజమే. దేశమంతా ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ముగింపు సందర్భంగా జరుపుకునే ఈద్ ఉల్ ఫితర్ రేపు జరగనుంది. ఈ మేరకు ఢిల్లీలోని జామా మసీదు ఇమామ్ నిన్న ఓ కీలక ప్రకటన చేశారు. నెలవంక కనిపించని కారణంగా నేడు (బుధవారం) నిర్వహించనున్న ఈద్ ఉల్ ఫితర్ ను గురువారానికి (రేపటికి) వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా రంజాన్ సెలవు దినాలను రేపు, ఎల్లుండిగా ప్రకటించింది. అయితే జమ్మూ కాశ్మీర్, కేరళల్లో మాత్రం నేడు (బుధవారం) ఈద్ ఉల్ ఫితర్ జరగనుంది. ఈ మేరకు గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ గా ఉన్న ముఫ్తీ బషీరుద్దీన్ అహ్మద్ తమకు నెలవంక కనిపించిందని నిన్ననే ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్రంలో నేడు ఈద్ ఉల్ ఫితర్ ను నిర్వహిస్తున్నారు. ఇక కేరళలోనే ఇలాంటి పరిస్థితుల్లోనే నేడు ఈద్ ఉల్ ఫితర్ ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.