: శంషాబాద్ విమానాశ్రయంలో మత్తుపదార్థాల స్వాధీనం


శంషాబాద్ విమానాశ్రయంలో భారీ స్థాయిలో మత్తుపదార్థాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మలేషియా ఎయిర్ లైన్స్ విమానంలో బ్యాంకాక్ వెళ్లేందుకు ప్రయత్నించిన చెన్నై వాసి అబ్దుల్ రషీద్ తనతో పాటు ఎలక్ట్రానిక్ పరికరం  ప్రింటర్ లో నాలుగు కిలోల క్యాటమిన్ మత్తు పదార్థాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న కస్టమ్స్ అధికారులు ఆ మత్తుపదార్థాన్ని స్వాధీనం చేసుకుని అతనిని అరెస్టు చేశారు. ఈ మత్తుపదార్థం విలువ స్థానికంగా 15 లక్షలుండగా, అంతర్జాతీయ మార్కెటులో రెండు కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News