: మేజిస్ట్రేట్ ముందు మాటమార్చిన స్వాతి హంతకుడు


తమిళనాడులోని నుంగంబక్కం రైల్వే స్టేషన్‌ లో జూన్ 24న ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని అత్యంత దారుణంగా నరికి చంపిన హంతకుడు రామ్ కుమార్ న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం మేజిస్ట్రేట్ ముందు మాటమార్చాడు. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రామదాస్ చెన్నై ప్రభుత్వాసుపత్రిలో వాంగ్మూలం నమోదు చేసుకునే సమయంలో తాను అమాయకుడినని, దళిత, పేద కుటుంబానికి చెందిన వాడిని కావడంతో పోలీసులు ఈ హత్య కేసులో తనను ఇరికించారని పేర్కొన్నాడు. పది రోజులపాటు హంతకుడు దొరకకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్, సిమ్ క్లోనింగ్ ఆధారంగా రామ్ కుమార్‌ ను హంతకుడిగా నిర్థారించి, అతని ఇంటిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో బ్లేడ్‌ తో గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అనంతరం పోలీసుల విచారణలో తన ప్రేమను అంగీకరించకపోవడానికి తోడు తనను కొండముచ్చు అని అవమానించిందని, అందుకే స్వాతిని హత్య చేశానని అంగీకరించిన సంగతి తెలిసిందే. దీంతో కేసులో చిక్కుముడి వీడిపోయిందని భావించిన పోలీసులు, తాజా ట్విస్టుతో కేసు మళ్లీ మొదటికొచ్చిందని తలలు పట్టుకున్నారు.

  • Loading...

More Telugu News