: భారత్ లో రంజాన్ రేపు కాదు: జామా మసీదు ఇమాం ప్రకటన
భారత్ లోని ముస్లింలకు పవిత్రమైన రంజాన్ రేపు కాదని జామా మసీదు ఇమాం ప్రకటించారు. ప్రపంచ దేశాల్లో ముస్లింలు ఈద్ ను రేపు నిర్వహిస్తున్నారు. అయితే భారత్ లో ముస్లింలకు మాత్రం ఈద్ ఊల్ ఫితర్ రేపు కాదని, ఎల్లుండని ఢిల్లీలోని జామా మసీదు ఇమాం ప్రకటించారు. దీంతో దేశంలోని ముస్లింలంతా ఎల్లుండి ఈద్ ఉల్ ఫితర్ నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. నెల రోజులపాటు నిష్టగా రోజా ఆచరించే ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా దానిని విరమిస్తారు. ఈ సందర్భంగా రంజాన్ ను పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటారు.