: సమ్మె విరమించిన తెలంగాణ న్యాయాధికారులు...రేపటి నుంచి విధుల్లోకి!
తెలంగాణ న్యాయాధికారులు సమ్మె విరమించారు. రేపటి నుంచి విధుల్లోకి వెళ్తామని ప్రకటించారు. గత పది రోజులుగా ఆందోళన చేసిన న్యాయాధికారులు సమ్మె విరమించడంతో కోర్టులు ఇక యథావిధిగా పనిచేస్తాయి. 11 మంది న్యాయాధికారుల సస్పెన్షన్ వ్యవహారంలో హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటిని శిరసావహిస్తామని న్యాయాధికారులు ఈ సందర్భంగా తెలిపారు.