: స్పైస్ జెట్ ఈద్ ఆఫర్...దుబాయ్ టు ముంబై లేదా పూణే@ 5,500


రంజాన్‌ ను పురస్కరించుకుని ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌ జెట్‌ ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. ‘ఈద్‌ ముబారక్‌’ పేరిట ప్రకటించిన ఆ ఆఫర్‌ ను విదేశాల్లో ఉన్న భారతీయులు వినియోగించుకునేందుకు వీలుగా రూపొందించారు. దుబాయి నుంచి భారత్‌ కు చేరుకునే స్పైస్ జెట్ విమానాల్లో టిక్కెట్‌ ధరను 5,500 రూపాయలుగా ప్రకటించింది. ఈ సేల్‌ జులై 3వ తేదీ నుంచి జులై 6వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో వుంటుంది. అంటే కేవలం నాలుగు రోజులు మాత్రమే దీనిని వినియోగించుకునే అవకాశం ఉంది. జులై 25వ తేదీ నుంచి అక్టోబరు 15 వరకు చేసే ప్రయాణాలకు ఈ నాలుగు రోజుల్లో మాత్రమే టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చని స్పైస్ జెట్ పేర్కొంది. ఈ ఆఫర్ కేవలం ఒకవైపు ప్రయాణానికి మాత్రమే వర్తిస్తుందని ఆ సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ లో దుబాయి నుంచి ముంబై లేదా పుణెకు చేరుకునేందుకు టికెట్ ధరను కేవలం 5,500 రూపాయలుగా పేర్కొంది. అలాగే దుబాయి నుంచి హైదరాబాద్‌ లేదా అమృత్‌సర్‌, లేదా కోజికోడ్‌, లేదా కొచ్చి, లేదా ఢిల్లీ, లేదా జయపురకు టికెట్ ధరను 5,960 రూపాయలుగా నిర్ణయించారు. వాటితోపాటు దుబాయి నుంచి అహ్మదాబాద్‌ లేదా మధురైకి టికెట్ ధరను 6,000 రూపాయలుగా నిర్ణయించారు.

  • Loading...

More Telugu News