: మద్రాస్, బాంబే, కలకత్తా హైకోర్టుల పేర్లు మార్పు... మోదీ క్యాబినెట్ నిర్ణయాలివే!


మద్రాస్ హైకోర్టును చెన్నై హైకోర్టుగా, బాంబే హైకోర్టును ముంబై హైకోర్టుగా మార్చేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కలకత్తా హైకోర్టుగా ఉన్న పేరును కోల్ కతా హైకోర్టుగా మార్చేందుకూ ఓకే చెప్పింది. నేడు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ తరువాత మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రులు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంట రుణాలపై వడ్డీ రాయితీలను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కందిపప్పు కొరతను తగ్గించేందుకు మొజాంబిక్ నుంచి పప్పు దిగుమతికి మంత్రి మండలి ఆమోదం పలికింది. ఆపై తమిళనాడులోని ఎనాయంలో భారీ ఓడరేవును నిర్మించే ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది.

  • Loading...

More Telugu News