: హైదరాబాద్‌లో భారీ వర్షం.. వాహనదారుల ఇబ్బందులు
హైదరాబాద్‌లో ఈరోజు పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. గచ్చిబౌలి, కొండాపూర్, టోలిచౌకి, మెహిదీపట్నం, లంగర్ హౌజ్, మణికొండ, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లి, యూసఫ్‌గూడ, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో నగరంలోని రహదారులు జలమయమయ్యాయి. పలు కూడళ్లలో భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడి, వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.