: రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయలుదేరిన న్యాయవాదులు.. అరెస్ట్
హైకోర్టును విభజించి, న్యాయాధికారులు, ఉద్యోగులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు చేస్తోన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈరోజు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. ఇందిరాపార్క్ వద్దకు భారీగా చేరుకున్న న్యాయవాదులు రాజ్‌భవన్ వరకు ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ రామచందర్‌రావు కూడా పాల్గొన్నారు. అయితే, రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నించిన న్యాయవాదులను ఇందిరాపార్క్ వద్ద పోలీసులు అడ్డుకుని, పలువురిని అరెస్టు చేశారు. దీంతో అక్కడ పోలీసులకి, న్యాయవాదులకి మధ్య వాగ్వివాదం జరిగింది.