: సన్మానాలంటూ తిరగొద్దు... పని మొదలుపెట్టండి: కొత్త మంత్రులతో మోదీ


కొత్తగా ఎంపికైన మంత్రులు హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉండాలని, సన్మానాలు, సత్కారాలు అంటూ సమయాన్ని వృథా చేయరాదని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మధ్యాహ్నం నూతన మంత్రులతో సమావేశమైన ఆయన, వెంటనే పని మొదలుపెట్టాలని అన్నారు. ఎంతో నమ్మకంతో మిమ్మల్ని మంత్రులుగా తీసుకున్నానని చెప్పిన ఆయన, విధుల్లో అలసత్వానికి తావివ్వకుండా కష్టించాలని సూచించారు. అవినీతికి ఏమాత్రం చోటిచ్చినట్టు తెలిసినా చూస్తూ ఊరుకోబోయేది లేదని హెచ్చరించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల నాటికి శాఖలపై పట్టును సాధించి పూర్తి సన్నద్ధంగా ఉండాలని సూచించారు.

  • Loading...

More Telugu News