: శునకాన్ని ఐదంతస్తుల భవంతి నుంచి తోసేసిన చెన్నై మెడికో... అరెస్టుకు వేట మొదలు!


మానవాళికి అత్యంత విశ్వాసాన్ని చూపించే జంతువుగా వేలాది సంవత్సరాలుగా మనుషులతో శునకాల బంధం పెనవేసుకుపోయింది. అందుకే కొందరు వాటిని ఇంట్లో పెంచుకుంటారు కూడా. అయితే, తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఓ వీడియోను, ఫోటోలను చూస్తే మాత్రం ఎవరి హృదయమైనా ద్రవించక మానదు. ఓ తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు ధరించిన ఓ యువకుడు, శునకాన్ని ఐదంతస్తుల భవంతి నుంచి కింద పడేస్తుంటే, మరో వ్యక్తి ఆ దృశ్యాన్ని వీడియో తీసి పోస్టు చేశాడు. వీరిద్దరూ చెన్నైకి చెందిన మెడికల్ స్టూడెంట్లని తెలుస్తోంది. వీరి పేర్లు గౌతమ్ సుదర్శన్, ఆశిష్ పాల్. వీరు చేసిన నిర్వాకం జంతు ప్రేమికులకు తీవ్ర ఆగ్రహం కలిగించగా, ఆ శునకం ఇప్పుడు ఎలా ఉందన్న విషయమై జంతు ప్రేమికులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరూ చెన్నైకి 600 కిలోమీటర్ల దూరంలోని తిరునల్వేలీ ప్రాంతానికి చెందిన వారని, వారిద్దరూ తప్పించుకు తిరుగుతున్నారని వెల్లడించిన పోలీసులు, ఇద్దరినీ త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. వీరిద్దరూ శునకాన్ని తోసేసిన భవంతి ఎక్కడుందన్న విషయం తెలియని కారణంగానే వీరి అరెస్టు వ్యవహారం ఆలస్యం అవుతోందని పోలీసు వర్గాలు అంటున్నాయి.

  • Loading...

More Telugu News