: హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధంగా ఉంది: బీజేపీ తెలంగాణ నేతలు
హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధంగా ఉందని బీజేపీ తెలంగాణ నేతలు పేర్కొన్నారు. ఈరోజు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. దీనికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచందర్‌రావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాజకీయాలు పక్కనపెట్టి హైకోర్టు విభజనకు సహకరించాలని అన్నారు. న్యాయవాదులు సమస్యల్లో చిక్కుకుంటుంటే కేసీఆర్ ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని అన్నారు. న్యాయవాదులు రోడ్డెక్కితే కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.