: సుప్రీం గడప తొక్కిన అగ్రిగోల్డ్ కేసు!


తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది మధ్య తరగతి కుటుంబాలను రోడ్డున పడేసిన అగ్రిగోల్డ్ వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కింది. వేల కోట్ల రూపాయలను డిపాజిట్లుగా సేకరించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం మెచ్యూరిటీ తీరిన బాండ్లకు సొమ్ము చెల్లించలేకపోయింది. దీంతో డిపాజిటర్లు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారు. కేసులు నమోదైన చాలా కాలం తర్వాత అగ్రిగోల్డ్ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేయగా, వారికి ఇటీవలే బెయిల్ లభించింది. అయితే ఈ బెయిళ్లను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో కొద్దిసేపటి క్రితం పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం... బెయిల్ లభించిన ముగ్గురు అగ్రిగోల్డ్ డైరెక్టర్లతో పాటు కేసును దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ అధికారులకు నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News