: మనసు మార్చుకున్న షీలా!... పార్టీ ఆదేశిస్తే యూపీ సీఎం బరిలోకి దిగుతానని వెల్లడి!


ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీల్లో వేగంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే తన కేబినెట్ ను విస్తరించిన ప్రధాని నరేంద్ర మోదీ యూపీకి చెందిన ఎంపీలకు ఎక్కువ మంత్రి పదవులిచ్చి ఆ రాష్ట్రంలో బీజేపీ విజయావకాశాలను మెరుగుపరుచుకున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా తన సన్నాహాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే యూపీ ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టేందుకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా అంగీకరించారు. ఈ నేపథ్యంలో మొన్నటిదాకా సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ససేమిరా అన్న పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ తాజాగా మనసు మార్చుకున్నారు. ప్రచార బాధ్యతలను ప్రియాంకా గాంధీ స్వీకరించడంతో సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఆమె సానుకూలత వ్యక్తం చేశారు. ‘‘నేను యూపీ కోడలిని’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పార్టీ ఆదేశిస్తే తాను యూపీ సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తానని కూడా ఆమె కుండబద్దలు కొట్టారు.

  • Loading...

More Telugu News