: స్పీకర్ కార్యాలయమా?... టీఆర్ఎస్ ఆఫీసా?: నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి


తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో టీ టీడీఎల్పీ కార్యాలయానికి కేటాయించిన గదులను ఇతరులకు కేటాయిస్తూ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి తీసుకున్న నిర్ణయంపై టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి అంతెత్తున ఎగిరిపడ్డారు. తమకు కేటాయించిన రెండు గదులను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే స్పీకర్ అసెంబ్లీ కమిటీలకు బదలాయించిన విషయాన్ని తెలుసుకుని, పరుగు పరుగున అసెంబ్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి అక్కడ మీడియాతో ఆవేశంగా మాట్లాడారు. అసలు అసెంబ్లీలో ఉన్న స్పీకర్ కార్యాలయం... స్పీకరుదా? లేక టీఆర్ఎస్ కార్యాలయమా? అని ఆయన నిప్పులు చెరిగారు. ముందస్తు నోటీసులు లేకుండా తమ గదులను ఇతరులకు ఎలా కేటాయిస్తారని కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న మధుసూదనాచారి... రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. తన కార్యాలయాన్ని టీఆర్ఎస్ ఆఫీసుగా మార్చేశారని ఆరోపించారు. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని కూడా ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News