: మోదీ క్యాబినెట్ నుంచి ఐదుగురికి ఉద్వాసన
ఈ ఉదయం కొత్తగా 19 మందికి తన మంత్రివర్గంలో స్థానం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రస్తుతం వివిధ శాఖలు నిర్వహిస్తున్న ఐదుగురిని తొలగించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన వెలువరించింది. మంత్రులు నిహాల్ చంద్, రామ్ శంకర్ కఠారియా, ఎంకే కుందారియా, సన్వర్ లాల్ జాట్, మునుసుఖ్ భాయ్ వాస్వాలను మోదీ తొలగించారు. వీరి పనితీరు సక్రమంగా లేదని, పలు కేసుల్లో ఆరోపణలు ఉన్నాయని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మంత్రుల పనితీరును సమీక్షించిన మీదటే, వీరి ఉద్వాసనకు మోదీ ఓకే చెప్పినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.