: దక్షిణాదికి అంతంతే... ఏపీ, తెలంగాణలకు నరేంద్ర మోదీ మొండిచెయ్యి!


భారత ప్రధాని నరేంద్ర మోదీ మలివిడత మంత్రివర్గ విస్తరణలో దక్షిణాదిని చిన్న చూపు చూశారు. కేవలం బీజేపీ ఎంపీలకు, ఉత్తరాదిన రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు పెద్ద పీట వేశారు. యూపీ, గుజరాత్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్ నుంచి నలుగురిని తీసుకున్నారు. దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలుండగా, కర్ణాటక నుంచి ఒక్కరికి మాత్రమే మంత్రివర్గంలో స్థానం లభించింది. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ ఎంపీ రమేష్ చందప్ప జిగజినాగిని తన జట్టులోకి మోదీ తీసుకున్నారు. ఆయన మినహా దక్షిణాది నుంచి స్థానం పొందిన వారెవరూ లేకపోవడం గమనార్హం. ఇక బీజేపీకి కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా స్థానం లభించలేదు. అలాగే, తెలంగాణలో మరింత బలంగా ఎదగాలన్న కోరికతో ఉన్న బీజేపీ అధిష్ఠానం, రాష్ట్రంలోని ఏ నేతనూ తాజా విస్తరణలో తీసుకోలేదు. ఇక అంతంత మాత్రం ప్రాతినిధ్యమున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలను మోదీ అసలు పరిగణనలోకే తీసుకోనట్టు కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News