: ప్రమాణ పత్రం చదవలేకపోయిన రామ్ దాస్ అత్వాలే... సహాయపడ్డ ప్రణబ్
రాజస్థాన్ నేత, బీజేపీ ఎంపీ విజయ్ గోయల్ తో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మహారాష్ట్ర రాజ్యసభ ఎంపీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రామ్ దాస్ అత్వాలేతో రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి 'మే' అనగానే, తన పేరును ఉచ్చరించకుండా రామ్ దాస్ ప్రమాణ పత్రాన్ని చదవడం ప్రారంభించారు. తప్పును గమనించిన ప్రణబ్, పేరును చదవాలని చెప్పారు. ఆపై కూడా అత్వాలే పలుమార్లు ప్రమాణ పత్రాన్ని చదవడంలో ఇబ్బందులు పడుతుంటే, ప్రణబ్ స్వయంగా ముందుండి చదువుతూ, ఆయనతో కొన్ని పదాలు పలికించారు. అనంతరం అసోంలోని నాగావ్ బీజేపీ ఎంపీ రాజెన్ గోహెన్ ప్రమాణం చేశారు.