: చిదంబరానికి షాక్!... ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో కార్తీకి ఈడీ సమన్లు!


కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రాజస్థాన్ భూ వివాదంలో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన సంస్థకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే రెండు పర్యాయాలు నోటీసులు జారీ చేసింది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం వంతు వచ్చింది. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. 2జీ స్కాంలో భాగమైన ఎయిర్ సెల్-మ్యాక్సిస్ ఒప్పందంలో పాత్ర ఉందంటూ ఆయనకు పీఎంఎల్ఏ చట్టం కింద ఆయనకు సమన్లు జారీ చేసింది.

  • Loading...

More Telugu News