: ఆటోను ఢీకొన్న కేశినేని ట్రావెల్స్ బస్సు... ముగ్గురి మృతి, కోదాడ పీఎస్ లో డ్రైవర్ లొంగుబాటు


తెలుగు రాష్ట్రాల పరిధిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల కారణంగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోగా, మరింత పెద్ద సంఖ్యలో గాయాల పాలయ్యారు. తాజాగా తెలంగాణలోని నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం గింజలూరు వద్ద కేశినేని ట్రావెల్స్ కు చెందిన ఓ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. వీరిని పెన్ పహాడ్ మండలంలోని చీదెళ్లకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్ కు సమాచారం అందజేసిన బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు ఆ తర్వాత అక్కడికి వచ్చిన అంబులెన్స్ క్షతగాత్రులను సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. తదనంతరం బస్సు డ్రైవర్ నేరుగా కోదాడ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.

  • Loading...

More Telugu News