: సమ్మె విరమించిన ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు


తెలంగాణలో ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సమ్మెబాటపట్టిన ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిందని యాజమాన్యాల ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే వంద కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు వైద్యఆరోగ్య శాఖ మంత్రి తెలిపారని, త్వరలోనే మిగిలిన బకాయిలను కూడా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని వారు వెల్లడించారు. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తామని వారు వివరించారు. నేటి నుంచి సమ్మె విరమిస్తున్నామని, రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా అందుతాయని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News