: గవర్నర్ తో ముగిసిన న్యాయాధికారుల భేటీ


హైకోర్టు విభజన డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న న్యాయాధికారులు, ఉద్యోగులతో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌ సమావేశం ముగిసింది. హైకోర్టు విభజన కోరుతూ న్యాయ విభాగానికి చెందిన ఉద్యోగులంతా ఆందోళన బాటపట్టడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రేపటి నుంచి విధుల్లో చేరాలని గవర్నర్ వారిని కోరారు. దీనికి స్పందించిన సదరు ప్రతినిధులు... న్యాయాధికారులపై విధించిన సస్పెన్షన్లు ఎత్తివేసి, తెలంగాణ కోర్టుల్లో జరిగిన ఏపీ న్యాయాధికారుల కేటాయింపులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న కేటాయింపులు తాత్కాలికమేనని గవర్నర్‌ వారికి తెలిపినట్టు తెలుస్తోంది. గవర్నర్ తో సమావేశమైన ఉద్యోగులు రేపు పూర్తి స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారని సమాచారం.

  • Loading...

More Telugu News