: రేయ్...వాయ్ అంటావేం?...దమ్ముంటే రా!: వెల్లంపల్లికి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సవాల్
విజయవాడలో చెలరేగిన గుడి వివాదం చివరికి వ్యక్తిగత దూషణలకు చేరింది. ఈ అంశంపై ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, బీజేపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఆరోపణలు సంధించుకున్నారు. గుడిని వివాదం చేయవద్దని ఎమ్మెల్సీ చెప్పగా, అర్ధరాత్రుళ్లు దేవాలయాలు కూల్చాల్సిన అవసరం ఏముంది? అని వెల్లంపల్లి ప్రశ్నించారు. ఆ సందర్భంగా జరిగిన చర్చలో తన మాటలకు అడ్డం వచ్చిన వెంకన్నను 'నువ్వుండవోయ్! నేను మాట్లాడుతున్నాను కదా' అంటూ వెల్లంపల్లి వారించారు. వెంటనే ఆగ్రహం వ్యక్తం చేసిన బుద్దా వెంకయ్య...'రేయ్...ఓయ్' అంటావేం...దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి. అంతేకానీ గుళ్ల పేరుతో వివాదాలు రేపకండి, మేము కూడా హిందువులమేనన్న సంగతి మర్చిపోకండి' అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో వెల్లంపల్లి నెమ్మదించడంతో వివాదం అక్కడితో సమసిపోయింది.